![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -124 లో.. సీతాకాంత్ తన మనసులోని మాటని రామలక్ష్మికి చెప్పి ప్రేమగా దగ్గరికి తీసుకున్నట్లు ఉహించుకుంటాడు. అప్పుడే పెద్దాయన వచ్చి సీతాకాంత్ కొత్తగా కనపడుతున్నాడు.. సిగ్గు పడుతున్నావంట ఆటపట్టిస్తాడు. ఆ సిగ్గుకి కారణం ఏంటని పెద్దాయన అడుగుగా.. ఆ రూమ్ లోకి వెళ్లాడానికి సిగ్గుగా ఉందని సీతాకాంత్ అంటాడు. నీ భార్య గదిలో ఉంటే ఆనందంగా ఉండాలి గానీ భయమెందుకని పెద్దాయన అంటాడు. అంటే ఇన్ని రోజులు మేమ్ ఫ్రెండ్స్ లాగా ఉన్నాం కదా.. ఇప్పుడు భార్యా భర్తలుగా ఉండాలంటే కొంచెం కంగారుగా ఉందని సీతాకాంత్ అనగానే.. నువ్వు వెళ్ళు ముందు అని పెద్దాయన పంపిస్తాడు.
సీతాకాంత్ సర్ నన్ను పెళ్లి చేసుకున్నాడంటే అక్కడున్న పరిస్థితికి తాళి కట్టారా.. ఇష్టంతో కట్టారా అని రామలక్ష్మి అనుకుంటుంది. అప్పుడే సీతాకాంత్ గదిలోకి వచ్చి అసలు రామలక్ష్మి నన్ను ఇష్టంగా పెళ్లి చేసుకుందా లేక ఆ పరిస్థితికి చేసుకుందా కనుక్కోవాలని.. నువ్వు ఢిల్లీ కోచింగ్ కి వెళ్తా అన్నావ్? మళ్ళీ తిరిగి వచ్చి పెళ్లి చేసుకున్నావని సీతాకాంత్ అడుగగా.. నేను మీ అమ్మ గారి నిజ స్వరూపం బయట పెట్టడానికి చేసుకున్నానని ఎలా చెప్పాలని అనుకుంటూ సైలెంట్ గా ఉంటుంది. మీరు పెళ్లి చేసుకోవద్దు అనుకున్నారు కదా.. మళ్ళీ నన్ను చేసుకున్నారని రామలక్ష్మి అడుగుతుంది. నువ్వు అంటే చాలా ఇష్టమని ఎలా చెప్పాలని సీతాకాంత్ మనసులో అనుకొని సైలెంట్ గా ఉంటాడు. దాంతో నేనంటే ఇష్టం లేదనుకొని రామలక్ష్మి ఎప్పటిలాగే చాప తెచ్చుకొని నేలపై పడుకుంటుంది. దాంతో రామలక్ష్మి ఇప్పుడు కూడా నన్ను ఒక ఫ్రెండ్ లాగా చూస్తుందని సీతాకాంత్ అనుకుంటాడు.
ఆ తర్వాత సందీప్ దగ్గరికి శ్రీవల్లి వెళ్లి.. ఆస్తిలో మనకి వాటా ఇవ్వమని అడగండి అని అంటుంది. దాంతో సందీప్ కోపంగా వెళ్లి సిగరెట్ తాగుతుంటాడు. అప్పుడే రామలక్ష్మి వాటర్ కోసం వెళ్లి సందీప్ ని చూస్తుంది. సందీప్ శ్రీలత దగ్గరికి వెళ్లి ఆస్తిలో వాటా ఇవ్వమని అన్నయ్యని అడుగమని సందీప్ అనగానే.. సందీప్ చెంప చెల్లుమనిపిస్తుంది శ్రీలత. ఈ ఆస్తి మొత్తానికి నిన్ను వారసుడిని చేస్తానని నేను అంటుంటే.. నువ్వేంటి వాటా అంటున్నావ్.. అందుకే కదా సీతాకాంత్ దృష్టిలో లో పెళ్లి, పిల్లలు అనే ఆలోచన లేకుండా చేశానని శ్రీలత చెప్తుంటే.. ఆ మాటలు అన్ని రామలక్ష్మి వింటుంది. ఇక గతంలో సీతాకాంత్ తో శ్రీలత మాట్లాడిన మాటలు గుర్తుకుచేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |